పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌వి ఎఫ్‌సి) సిఫారసులకు అనుగుణంగా 2024-25 సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు మంగళవారం నాడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు అన్‌టైడ్ గ్రాంట్‌లుగా రూ.1598.80 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు రాష్ట్రంలోని అన్ని అర్హత కలిగిన 75 జిల్లా పంచాయతీలు, 826 బ్లాక్ పంచాయతీలు, 57,691 గ్రామ పంచాయతీలకు సంబంధించినవి.
2024-25 ఆర్థిక సంవత్సరం అన్‌టైడ్ గ్రాంట్స్‌లో రెండవ విడతగా రూ. 420.99 కోట్లు, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్‌టైడ్ గ్రాంట్ల మొదటి విడతలో విత్‌హెల్డ్ మొత్తం రూ. 25.48కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేయబడ్డాయి. ఈ నిధులు రాష్ట్రంలోని 13097 అర్హత గల గ్రామ పంచాయతీలు, 650 సక్రమంగా ఎన్నికైన బ్లాక్ పంచాయతీలు, మొత్తం 13 జిల్లాల పంచాయతీలకు సంబంధించినవి.
కేంద్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్, జల్ శక్తి (తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ) మంత్రిత్వ శాఖల ద్వారా, గ్రామీణ స్థానిక సంస్థల కోసం రాష్ట్రాలకు పదిహేనవ ఆర్థిక సంఘం (XV FC) గ్రాంట్‌లను విడుదల చేయాలని సిఫార్సు చేసింది, వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. కేటాయించిన గ్రాంట్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా సిఫార్సు చేయబడతాయి. విడుదల చేయబడతాయి. రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్‌లో పొందుపరచబడిన 29 సబ్జెక్టుల క్రింద, జీతాలు, ఇతర ఖర్చులు మినహా, పంచాయితీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలు స్థాన-నిర్దిష్ట అవసరాల కోసం అన్‌టైడ్ గ్రాంట్‌లను ఉపయోగించుకుంటాయి.