ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్‌మెంట్‌లో మరో ముందడుగు పడింది. అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.
మా విజ్ఞప్తి మేరకు, అమరావతిలో తమ నూతన కార్యాలయ నిర్మాణానికి భారత కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (CAG) కార్యాలయం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనానికి లభించిన అనుమతి—మన రాజధాని పరిపాలనను మరింత బలోపేతం చేసే ప్రముఖ మైలురాయి. అమరావతిని శక్తివంతమైన, పూర్తి స్థాయి పాలనా కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో ఇది మరో దృఢమైన అడుగు...అని కేంద్రమంత్రి పెమ్మసాని ఎక్స్‌లో తెలిపారు.