వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక చెల్లదంటూ ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. పార్టీలకు శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు వర్తించవనిపేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని.. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్య వ్యతిరేకం అని తెలిపింది. శాశ్వత అధ్యక్షుడుగా జగన్ ఎన్నికయినట్లు మీడియా కథనాలు ఆధారంగా ఈసీ స్పందించింది. ఈ విషయమై పార్టీకి ఎన్ని లేఖలు రాసిన పట్టించుకోలేదు. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శికి పంపిన నోటీసులలో పేర్కొంది.