మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఇప్పటికే రెండు సార్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. కాగా..మరోసారి విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
శనివారం రాత్రి పులివెందులలోని అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. సోమవారం (మార్చి 6న) హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాయానికి రావాలని అందులో పేర్కొన్నారు. అయితే.. 6న తాను విచారణకు రాలేనని ఎంపీ చెప్పగా ఖచ్చితంగా రావాల్సిందేనని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
అటు ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సైతం సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. సోమవారం (మార్చి 6న) కడపలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.