ఎంపీ అవినాష్ రెడ్డికి మ‌ళ్లీ సీబీఐ నోటీసులు

YS Viveka Murder Case MP Avinash Reddy gets once again cbi notice.ఎంపీ అవినాష్ రెడ్డికి బుధ‌వారం సీబీఐ మ‌రోసారి నోటీసులు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 25 Jan 2023 1:30 PM IST

ఎంపీ అవినాష్ రెడ్డికి మ‌ళ్లీ సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బుధ‌వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. హైద‌రాబాద్‌లోని సీబీఐ కార్యాల‌యంలో ఈ నెల 28న ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో తెలిపింది.

కాగా.. వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ నెల 23న సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 24న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అందులో పేర్కొన్నారు. అయితే.. ముంద‌స్తుగా నిర్ణ‌యించిన కార్య‌క్ర‌మాల తాను విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని, నాలుగు రోజుల స‌మ‌యం కావాల‌ని అవినాష్ రెడ్డి.. సీబీఐ అధికారుల‌ను కోరారు. ఈ నేప‌థ్యంలో సీబీఐ ఈ నెల 28న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని రెండోసారి నోటీసులు జారీ చేసింది.

Next Story