సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐయ సిట్ తుది చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 36 మందిని నిందితులుగా చేర్చింది. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు తేల్చింది.నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సమాచారం. గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను సిట్‌ను నియమించగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
కాగా ఎవరెవరికి కమీషన్లు ఇచ్చారనే లావాదేవీల వివరాలను సీబీఐ సిట్ సేకరించింది. 2019-24 మధ్య లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగం.. కల్తీ నెయ్యి వ్యవహారంలో బోలేబాబా డెయిరీ కీలకపాత్ర పోషించినట్లు నివేదికలో తెలిపారు. కల్తీ నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డు నాణ్యత దెబ్బతిందని సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.