ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డికి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆగస్టు 14న తమ ఎదుట హాజరుకావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఆదేశించింది.
సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ జూన్ 30న మూడో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్‌లో వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ-8గా చేర్చారు. అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వారి సహచరుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్లను ఏ-6, ఏ-7 లుగా సీబీఐ చార్జ్ షీట్‌లో చేర్చింది.