అమరావతి: వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేర‌కు రెండు వారాలపాటు విదేశాలకు వెళ్లేందుకు విజ‌య‌సాయికి అనుమతి ల‌బించింది. అక్టోబరులోగా రెండు వారాలు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరుచేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి.. దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్లేందుకు అనుమతి కోరారు. తీరప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు స‌ద‌రు ప్రాంతాల‌కు వెళ్తున్నట్లు కోర్టుకు తెలిపారు విజ‌య‌సాయి. ఈ మేర‌కు కోర్టు విజ‌య‌సాయిని రూ.5 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ.. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది.


సామ్రాట్

Next Story