రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. జగన్ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద చోటుచేసుకున్న తోపులాటలో గాయపడ్డ కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు సరిగా లేవని తోపుదుర్తి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు పోలీసులు.ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టడంతోనే జగన్ వచ్చినప్పుడు బ్యారికేడ్లను తోసుకుని వైసీపీ కార్యకర్తలు వెళ్లినట్టు పోలీసులు ఆరోపించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు పై కూడా పోలీసు కేసు నమోదయింది. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో కారుమూరి మాట్లాడుతూ కూటమి నేతలను నరుకుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై కక్ష పెట్టుకోవద్దని టీడీపీ నాయకులు కూడా అడుగుతున్నారని, అది మాత్రం జరగదన్నారు. కారూమూరి వ్యాఖ్యలపై గుంటూరులోని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను ఫిర్యాదు చేశారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.