పోసాని కృష్ణమురళిపై మరో కేసు

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది

By Medi Samrat  Published on  16 Nov 2024 9:24 AM GMT
పోసాని కృష్ణమురళిపై మరో కేసు

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఏపీ లోని పలు ప్రాంతాల్లో పోసానిపై ఇప్ప‌టికే కేసులు నమోదు చేశారు. అనంతపురంలో తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు పోసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. త్వరలోనే పోసానికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.

సినీనటి శ్రీరెడ్డిపైనా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం నాయకులు ఎన్.చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబాలతో పాటు ఇతర టిడిసి నేతలు, వారి కుటుంబాలపై అసభ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైఎస్సార్‌సీపీ మద్దతుదారు, నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. విశాఖపట్నంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ మహిళా కార్యకర్తలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

Next Story