వైసీపీ ఎన్‍ఆర్‍ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‍పై కేసు

Case Filed Against Punch Prabhakar. వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదైంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆయనపై

By Medi Samrat
Published on : 17 Aug 2021 6:33 PM IST

వైసీపీ ఎన్‍ఆర్‍ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‍పై కేసు

వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదైంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితర ప్రముఖులపై పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడంటూ వచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఈ కేసు న‌మోదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో తాజా కేసు నమోదైంది. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.






Next Story