అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

By -  Medi Samrat
Published on : 9 April 2026 3:30 PM IST

అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన వ్యవహారంలో ఆయనపై అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు నిర్వహించారనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. గుంటూరులోని ఆ పత్రిక కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ, అది ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడం, విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గుంటూరులోని అరండల్ పేట పోలీస్‌స్టేషన్‌లో అంబటి రాంబాబుతో పాటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళి సహా పలువురు వైసీపీ నేతలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

Next Story