వైసీపీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ నేత అంబటి మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వీడియోలను మార్ఫింగ్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు సోదరుడు మురళిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో అంబటి మురళీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అంబటి మురళీపై కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రెచ్చగొట్టిన ధూళిపాళ్లపై కేసు ఎందుకు పెట్టలేదన్నారు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.