స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది

By Medi Samrat  Published on  11 Sep 2024 3:08 PM GMT
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం 'సెబ్' ను ఏర్పాటు ఏర్పాటు చేసింది. 'సెబ్' ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా పనిచేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.12ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 'సెబ్' విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని కూడా రిలీవ్ చేసింది. వారిను ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. 'సెబ్' కు చెందిన వాహనాలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, అద్దె భవనాలను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని తెలిపారు. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం సిబ్బందిని 'సెబ్' కు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు 4,393 మందిని కేటాయించారు. వైసీపీ హయాంలో సెబ్ ఏర్పాటు చేయకముందు ఉన్న తరహాలో ఎక్సైజ్ శాఖ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెబ్ రద్దు చేసేందుకు ఏపీ కేబినెట్ అమోదం తెలిపింది.

Next Story