ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈ సారి ఎన్నికల విధులు నిర్వహించకూడదని ఈసీ తెలిపింది. వాలంటీర్లను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. కేవలం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.
2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది.