ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

Byreddy Siddharth Reddy. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని

By Medi Samrat  Published on  5 April 2023 8:01 AM GMT
ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలలో పాల్గొన్న‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి


అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జగ్జీవన్ రామ్ శిలావిగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంత‌రం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ 1952 నుండి వరుసగా 8సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేశారని దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఎమ్మెల్యే చిర్ల జ‌గ్గిరెడ్డి మాట్లాడుతూ.. పేద వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారని, ఎన్నో పదవులు సుదీర్ఘకాలం అనుభవించిన చాలా నిరాడంబర జీవితం గడిపారాని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపీ నాయకులు, యువత, తదితరులు పాల్గొన్నారు.
Next Story