కేసీఆర్ పై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిని విమర్శిస్తూ బుద్ధా వెంకన్న..

By Medi Samrat  Published on  26 Feb 2024 6:39 PM IST
కేసీఆర్ పై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిని విమర్శిస్తూ బుద్ధా వెంకన్న.. కేసీఆర్ గురించి కూడా మాట్లాడాడు. తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయినా తెచ్చిన కేసీఆర్‌కే పేరు వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయినా తెచ్చిన కేసీఆర్‌కు పేరు వచ్చినట్లు.. ఫ్లై ఓవర్ కోసం తాను ఉద్యమం చేస్తే.. కేశినేని నాని క్రెడిట్ కొట్టేశారని ఆరోపించారు.

విజయవాడ ఫ్లై ఓవర్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. ఫ్లై ఓవర్ కోసం తాను ఉద్యమం చేశానన్న బుద్ధా వెంకన్న.. తనకు పేరు వస్తుందనే ఉద్దేశంతో కేశినేని నాని తానే తెచ్చానంటూ ప్రచారం చేసుకున్నాడని విమర్శించారు. కేశినేని నాని ఓ కోవర్టు అంటూ విమర్శలు గుప్పించారు. తనను ఇంఛార్జిగా తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు. రాజీనామా చేస్తానంటూ చంద్రబాబుతో చెప్పి కోఆర్డినేటర్ పదవిని కేశినేని నాని తెచ్చుకున్నాడని అన్నారు. వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి కోవర్టుగా కేశినేని నాని పనిచేశారని ఆరోపణలు గుప్పించారు.

Next Story