కీలక భేటీలలో భాగమవుతున్న బ్రదర్ అనిల్ కుమార్

ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుడి పాలెంలో పాస్టర్లతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు

By Medi Samrat  Published on  7 Feb 2024 7:31 PM IST
కీలక భేటీలలో భాగమవుతున్న బ్రదర్ అనిల్ కుమార్

ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుడి పాలెంలో పాస్టర్లతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. బలవంతుడిని ఓడించేందుకు దేవుడెప్పుడూ బలహీనుడినే ఎంచుకుంటాడని అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఏమీ తెలియని స్థితిలో ఉన్నపుడు ఓ ఉన్నతమైన పిలుపు ఇస్తాడని అన్నారు. దేవుడి రాజ్యం గురించి చెప్పేందుకే వచ్చానని అన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు తాను ఇక్కడికి రాలేదని అనిల్ కుమార్ తెలిపారు.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా, పోలవరం సహా అనేక అంశాల్లో టీడీపీ-వైసీపీ పార్టీలు బీజేపీతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయని షర్మిల ఆరోపిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా వైసీపీ, టీడీపీ లొంగిపోవటంతో రాష్ట్రాన్నే ఏలుతుందని విమర్శిస్తున్నారు. సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా షర్మిల విమర్శలు చేస్తూ ఉండడంతో.. వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.

Next Story