రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను దేవుడు చూస్తూ ఊరుకోడు : బ్రదర్ అనిల్ కుమార్

క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడులోని ఓ చర్చ్ లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  27 Feb 2024 8:58 PM IST
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను దేవుడు చూస్తూ ఊరుకోడు : బ్రదర్ అనిల్ కుమార్

క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడులోని ఓ చర్చ్ లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసని అన్నారు. దేవుడు ఉన్నాడని, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను చూస్తూ ఊరుకోడని అన్నారు. తాత్కాలిక ఆనందం కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ అనిల్ పర్యటిస్తాడని అంటున్నారు.

మరో వైపు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. క్రికెటర్‌ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) తీరుపై షర్మిల స్పందించారు. ‘‘ఆడుదాం ఆంధ్రా అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైకాపా నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్రా క్రికెట్ అసోసియేషనా.. అధ్వానపు క్రికెట్ అసోసియేషనా? ఈ విషయంపై వెంటనే విచారణ జరగాలి’’ అని షర్మిల పోస్టు పెట్టారు.

Next Story