క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు : మంత్రి ఆర్కే రోజా

Bright future with sports Minister RK Roja. తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన 66వ రాష్ట్ర‌ స్ధాయి రోల్ బాల్ క్రీడా పోటీలు

By Medi Samrat  Published on  22 Jan 2023 2:08 PM GMT
క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు : మంత్రి ఆర్కే రోజా

తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన 66వ రాష్ట్ర‌ స్ధాయి రోల్ బాల్ క్రీడా పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలలు నుండి అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా రాష్ట్ర‌ పర్యాటక, క్రీడా, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ది శాఖా మంత్రి ఆర్కే రోజా హాజ‌ర‌య్యారు. మంత్రి రోజా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. యువత క్రీడలపట్ల ఆశక్తి చూపడం వల్ల మంచి శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవచ్చనని తెలిపారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంద‌ని.. క్రీడాకారుల‌ను ప్రోత్సహించడానికి ప్ర‌భుత్వం త‌రుపున‌ అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని మంత్రి రోజా హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన రోల్ బాల్ టోర్నమెంట్.. క్రీడాకారులు, ప్రేక్షకుల కేరింతల మధ్య ఆధ్యంతం ఉత్సహాభరితంగా జరిగాయి. అండ‌ర్ 17 బాలుర రోల్ బాల్ చాంఫియన్ షిప్ ని చిత్తూరు జిల్లా జట్టు 6-3 స్కోర్ తేడాతో విశాఖపట్నం జిల్లా జట్టుపై ఘన విజయంతో ట్రోఫీని కైవసం చేసుకుంది. అండ‌ర్ 17 బాలికల విభాగంలో ప్రధమ స్దానం కృష్ణాజిల్లా, ద్వితీయ స్ధానం నెల్లూరు జట్టు, అండ‌ర్ 14 బాలుర విభాగంలో ప్రధమ స్ధానం చిత్తూరు జట్టు, ద్వితీయ స్ధానం కృష్ణా జిల్లా జట్టు, అండ‌ర్ 14 బాలికల విభాగంలో ప్రధమ స్ధానం కృష్ణాజిల్లా జట్టు, ద్వితీయ స్ధానం నెల్లూరు జిలా జట్లు గెలుపొందాయి. విజేతలకు మంత్రి రోజా ట్రోఫీలను అందజేశారు.

Next Story