ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి అంటూ ఓ బుడతడు సీఐను ఆశ్రయించాడు. వివరాళ్లోకెళితే.. పలమనేరు పట్టణం ఆదర్శ ప్రైవేట్ స్కూల్ లో కార్తికేయ అనే ఆరేళ్ల బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే.. బాలుడు స్కూలు దగ్గర జేసీబీతో రోడ్డు తవ్వేసి ట్రాక్టర్లను అడ్డుగా పెట్టారని.. పోలీసులు మీరందరూ వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయండని కార్తికేయ సీఐ ను ఆశ్రయించాడు. కార్తికేయతో సీఐ భాస్కర్, ఎస్సైలు నాగరాజు, సుబ్బారెడ్డి సరదాగా కాసేపు ముచ్చటించారు. సీఐ భాస్కర్ మేము అందరూ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తామని బాలుడికి చెప్పారు. దీంతో శాంతించిన కార్తికేయకు స్వీట్ తినిపించి ఫోన్ నెంబర్ ఇచ్చారు సిఐ భాస్కర్. నీకు ఎటువంటి సమస్య ఉన్న కాల్ చేయమని సూచించారు. అలాగే బాగా చదువుకోవాలని కార్తికేయతో చెప్పారు. ప్రస్తుతం వీడియో వాట్సప్, ఫేస్బుక్ లో వైరల్ అవుతుండటంతో బాలుడు మాట్లాడిన తీరు జానాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.