2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా జగన్ చూశారని బొత్స అన్నారు. చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి 11 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు. మూడు టీవీ ఛానళ్లు, మూడు పేపర్లతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని బొత్స విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసిందని, మళ్లీ పెళ్లి అన్నట్టుగా అమరావతి పనులకు పునఃప్రారంభం చేశారన్నారు. అమరావతికి వచ్చిన మోదీ ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కూటమి నేతల ప్రచార పిచ్చితో సింహాచలం ఆలయం వద్ద ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వం హత్యలేనని ఆరోపించారు.