ఏపీలో మౌలిక వసతులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్‌లో కరెంటు లేదని, తానే స్వయంగా అనుభవించానని ఆరోపించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యుత్ కోసం జనరేటర్‌ను ఉపయోగించామని.. ఈ అంశం ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి అని బొత్స వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన వ్యక్తులు అనవసరమైన సమస్యలను లేవనెత్తడం సరికాదని ఆయన అన్నారు.
ఇప్పుడు కొత్తగా నిర్మించే రోడ్డుపైనే నిల్చున్నానని, కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లు ఎలా అభివృద్ధి చెందాయో చూపిస్తానన్నారు. ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం మంచిది కాదని, తన మాటలను వెనక్కి తీసుకోవాలని మంత్రి బొత్స కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.
అంతకుముందు.. కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని.. రోడ్లు ధ్వంసమయ్యాయని, దేశంలోని అన్ని నగరాల్లో హైదరాబాద్ ది బెస్ట్ అని వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు ఒక్కసారి ఏపీకి వచ్చి ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడాలని సూచించారు.