రక్షణ కల్పించండి సీఎం జగన్ సార్: బోరుగడ్డ అనిల్

Borugadda Anil Kumar Sensational Comments on Kotamreddy Sridhar Reddy. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించారంటూ వైసీపీ నెల్లూరు రూరల్

By Medi Samrat
Published on : 7 Feb 2023 6:15 PM IST

రక్షణ కల్పించండి సీఎం జగన్ సార్: బోరుగడ్డ అనిల్

బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించారంటూ వైసీపీ నెల్లూరు రూరల్ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. అయితే మరోవైపు నిన్న రాత్రి గుంటూరు డొంకరోడ్డులో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని దుండగులు తగులబెట్టారు. తగలబడిన కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తనకు కోటంరెడ్డి, టీడీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. కోటంరెడ్డికి సవాల్ విసిరినందుకే తన కార్యాలయాన్ని తగులబెట్టారని అన్నారు. టీడీపీ నాయకులే ఈ పని చేశారని ఆరోపించారు. తన కార్యాలయాన్ని తగులబెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని.. యాక్సిడెంటల్ గా జరిగిన ప్రమాదం కాదని అన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించారని అనిల్ ఆరోపించారు. దీని వెనుక టీడీపీ నేత నక్కా ఆనందబాబు హస్తం కూడా ఉందని చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బోరుగడ్డ అనిల్ కుమార్ ఫోన్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. నెల్లూరు వీధుల్లో కోటంరెడ్డిని ఈడ్చుకెళ్తానని అనిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు గుంటూరులోని అనిల్ కార్యాలయంలో ఫర్నీచర్ దగ్దం కావడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.


Next Story