ఏపీలో చాపకింద నీరులా విస్త‌రిస్తున్న‌ బ్లాక్‌ ఫంగస్‌..!

Black Fungus Cases In AP. ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు విజృంబిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు

By Medi Samrat  Published on  9 Jun 2021 2:05 PM IST
ఏపీలో చాపకింద నీరులా విస్త‌రిస్తున్న‌ బ్లాక్‌ ఫంగస్‌..!

ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు విజృంబిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 1,600 కేసులకు పైగా నమోదయ్యి ఆందోళన పెట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 80 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతుండ‌గా.. వారిలో 98 మంది చనిపోయారు. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. భవిష్యత్తులో కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యశాఖ అంచనా ప్ర‌కారం.. ఈ నెల రెండో వారం పూర్తయ్యే నాటికి 2,100 కేసులు, మూడో వారం నాటికి సుమారు 2,700 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతాయని తెలుస్తోంది.

ప్రతి రోజు సగటున 80 మంది ఫంగ‌స్ బారిన ప‌డుతుండ‌గా.. భవిష్యత్తులో ఈ సంఖ్య వందలకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వైద్య నిపులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం గుంటూరు, చిత్తూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో అత్య‌ధికంగా కేసులు ఉన్నాయి. ఫంగస్‌ మరణాలు కూడా ఈ ఆరు జిల్లాల్లోనే అధికంగా నమోదవుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటి వరకూ అత్యధికంగా 15 మంది బ్లాక్‌ఫంగస్‌తో మృతి చెందారు. ఫంగ‌స్ బారిన ప‌డిన‌ వారిలో ఎక్కువ శాతం మందికి ప్రభుత్వాస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఏర్పాట్లు మాత్రం చేయడం లేదనే వాద‌న వినిపిస్తుంది.


Next Story