మాజీ సీఎం జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారులను బెదిరిస్తూ జగన్ మాట్లాడే భాష మార్చుకోవాలి.. లేదంటే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. జగన్ జ్ఞానంతో మాట్లాడాలి.. జగన్ మాటలు నమ్మిన పీఎస్ఆర్ ఆంజనేయులుకు జైల్లో ఆరోగ్యం పాడైందన్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి బూమ్ బూమ్ బీర్లు అమ్ముతారా.. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి తిరుపతి లడ్డు తయారీకి 420 నెయ్యి సరఫరా చేస్తారా అనిసెటైర్లు సంధించారు.
జగన్ కారణంగా మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు జైలుకి వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రాలేరన్నారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. లోకేష్ పాదయాత్రపై జగన్ రాళ్లు వేయించలేదా..? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం విధానాన్ని నేను తప్పు బడితే నన్ను ట్రోల్ చేశారని గుర్తుచేశారు.