బాలయ్యకు చేదు అనుభ‌వం

Bitter experience for MLA Balakrishna. నందమూరి బాలకృష్ణ ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్

By Medi Samrat  Published on  9 March 2021 10:06 AM GMT
బాలయ్యకు చేదు అనుభ‌వం

నందమూరి బాలకృష్ణ ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ తనయుడు అయిన బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా బాలయ్య ఫ్యాన్స్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపిలో జరగబోయే పుర ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.

మొన్న ఓ అభిమాని ఫోటో తీసినందుకు చెంప ఛెల్లుమనిపించి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాలయ్య తన నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే బాలకృష్ణ 21వ వార్డు మోత్కుపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు స్థానికులు గోబ్యాక్ బాలకృష్ణ అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి ఇక్కడ టీడీపీ నేతలు ఇప్పటికే ప్రచారం నిర్వహించారు.

బాలకృష్ణ టీడీపీ నేతలతో మరోసారి అక్కడికి రావడం పై వైసీపీ నేతలు అభ్యంతరం తెెలిపారు. ఈ క్రమంలో వైసీపీ, టీీడీపీ నేతల మద్య స్వల్ప ఘర్షణ కూడా జరిగింది. అంతే కాదు ఈ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ అభ్యర్థి మారుతీరెడ్డిల ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణను పలువురు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గోబ్యాక్ బాలకృష్ణ.. జై జగన్.. అని నినాదాలు చేశారు.


Next Story
Share it