ప్రతి ఒక్క ఉద్యోగికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

Biometric Attendance System For Employees. ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పని సరిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని మైనారిటీ

By Medi Samrat  Published on  19 Aug 2021 11:11 AM GMT
ప్రతి ఒక్క ఉద్యోగికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పని సరిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అదేశించారు. కరోనా వల్ల బయోమెట్రిక్ విధానానికి కొంత వెసలుబాటు కల్పించినప్పటికీ ప్రస్తుతం ప్రతి ఒక్క ఉద్యోగి బయోమెట్రిక్ అంటెండెన్స్ ను నమోదు చేసుకోవాలని, తదనుగుణంగా విభాగ అధినేతలు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలను ప్రత్యేక కార్యదర్శి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు, పనివిధానాన్ని పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కార్పొరేషన్, వక్స్ బోర్డు, ఎపి హజ్ కమిటీ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అదేశాలు జారీ చేస్తూ బయోమెట్రిక్ హాజరు విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టమైన అదేశాలు జారీ చేసారని, తదనుగుణంగా వ్యవహరించాలన్నారు. దస్ర్తాలకు సంబంధించి తప్పనిసరిగా ఈ ఆఫీస్ విధానాన్ని మాత్రమే పాటించాలని, ఫిజికల్ ఫైల్ విధానాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు. ఇందాజ్ ఘర్ ను సందర్శించిన చంద్రుడు సంస్ధ అదాయవనరులపై ప్రత్యేక దృష్టి సారించారు.

సంబంధిత భవనంలోని పలు అంతస్ధులు అద్దెకు ఇవ్వగా వాటి నుండి ఎంత సమకూరుతోంది, మార్కెట్లో అద్దెలు ఎలా ఉన్నాయి అన్న దానిపై అరా తీసారు. ఎప్పటి కప్పుడు మదింపు చేస్తూ సంస్ధ అదాయ వనరులను పెంచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కరోనా వల్ల హజ్ యాత్రలు నిలిచిపోయాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. మైనారిటీల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ప్రత్యేక కార్యదర్శి వెంబడి అయా విభాగాల అధిపతులు, ఇతర అధికారులు ఉన్నారు.


Next Story
Share it