తల్లికి వందనం రెండో విడత.. వారికి మాత్రమే డబ్బుల జమ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది.
By అంజి
తల్లికి వందనం రెండో విడత.. వారికి మాత్రమే డబ్బుల జమ
అమరావతి: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు అందుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్ 12 నుంచి తల్లికి వందనం పథకం డబ్బుల్ని విద్యార్థుల తల్లుల అకౌంట్‌లలో ప్రభుత్వం జమ చేయడం మొదలుపెట్టింది. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు.
అయితే ఫస్ట్ ఫేజ్‌లో డబ్బులు జమ కానివారు, ఒకటో తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ఈ నెల 5న ఖాతాల్లో డబ్బుల్ని జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఈ పథకం కింద డబ్బులు అందనున్నాయి. కాగా సెకండ్ ఫేజ్‌లో మీ పేరు ఉందో తెలుసుకోవడానికి https://gsws-nbm.ap.gov.in/ ను విజిట్ చేయండి.
అక్కడ తల్లికి వందనం పథకాన్ని సెలక్ట్ చేసుకుని.. విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా, కాదా అన్నది తెలసిపోతుంది. మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా మీ పేరు ఉందో తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇవాళ్టి నుంచి టెన్త్ విద్యార్థులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు జరుగనున్నాయని, దాదాపు 2.28 కోట్ల మంది పాల్గొంటారని తెలిపారు.