ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. సంజయ్‌ను 21 రోజుల్లోగా సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఐడీ చీఫ్‌గా సంజయ్ పని చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్‌పై ఉన్న ఆరోపణలపై దృష్టి పెట్టింది. అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి సంజయ్ నిందితుడిగా తేల్చింది. ఈ మేరకు ఆయనపై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంజయ్ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే సంజయ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. తాజా విచారణలో సంజయ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. సంజయ్‌ను కస్టడీకి తీసుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.