ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి బిగ్ రిలీఫ్

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో పెద్ద ఉపశమనం లభించింది.

By -  Knakam Karthik
Published on : 9 April 2026 9:00 AM IST

Andrapradesh, MidhunReddy, YSRCP, LiquorScam, ACB, Vijayawada, BailConditions

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి బిగ్ రిలీఫ్ 

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న ఆయనకు గతంలో విధించిన బెయిల్ షరతులను కోర్టు సడలించింది. ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలన్న నిబంధనను న్యాయస్థానం రద్దు చేసింది.

అలాగే, విదేశీ ప్రయాణాలకు ఆటంకం కలగకుండా తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు కూడా న్యాయమూర్తి అనుమతించారు. ఇందుకోసం రూ.లక్ష డిపాజిట్ చెల్లించాలని ఆదేశించారు. నిబంధనల సడలింపు కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు. దీంతో ఎంపీకి ఈ కేసులో ఎదురవుతున్న వ్యక్తిగత హాజరు నిబంధనల నుంచి వెసులుబాటు లభించింది.

Next Story