శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని టిటిడి మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. 10 మంది భక్తులు మృతి చెందడం బాధాకరం.. కూటమి ప్రభుత్వం పాలనలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన లేదని.. ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన, సింహాచలం తొక్కిసలాట ఘటన, తాజాగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఘటన చూస్తేనే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అర్ధమవుతుందన్నారు. 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. భక్తులు యోగక్షేమాలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు.