విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డ బండ్ల గణేష్
Bandla slams Vijayasai Reddy over caste remarks. ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వైఎస్సార్సీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
By Medi Samrat Published on 16 April 2022 9:00 AM GMTప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వైఎస్సార్సీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయి కులం వ్యాఖ్యలపై బండ్ల కలత చెందినట్లు తెలిసింది. ఈ మేరకు శనివారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్స్ చేశారు. ప్రత్యేకంగా ఓ కులాన్ని టార్గెట్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్లు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
నాకు వైఎస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
నువ్వు పెద్ద దరిద్రానివి
మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లో కి లాగుతున్నవ్
కెసిఆర్ ను చూసి నేర్చుకో
అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు @VSReddy_MP
అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది.@VSReddy_MP
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
బండ్ల ట్వీట్స్‌లో.. 'నాకు వైఎస్సార్ అన్నా.. జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం. నువ్వు పెద్ద దరిద్రానివి. మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లో కి లాగుతున్నవ్. కెసిఆర్ ను చూసి నేర్చుకో. అన్ని కులాల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారని' ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో.. 'అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుందని' చురకలంటించారు.
మీకు కులం నచ్చకుంటే ...కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి ... చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
అధికారం శాశ్వతం కాదు
రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు
ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు
నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదు@VSReddy_MP గారు
....కమ్మ వారిని తిట్టాడా న్ని తట్టుకోలేక పోతున్న
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు ...
దయచేసి కులాన్ని తిట్టకు...
ఇదేనా నీ సంస్కారం ?
నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు...ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెట్టికెక్కి ప్రవర్తిస్తున్నవు @VSReddy_MP
ఇంకో ట్వీట్‌లో.. 'మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి.. చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదని' రాసుకొచ్చారు. మరో ట్వీట్‌లో 'కమ్మ వారిని తిట్టాడా న్ని తట్టుకోలేక పోతున్న.. నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు.. దయచేసి కులాన్ని తిట్టకు.. ఇదేనా నీ సంస్కారం.? నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు.. ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెట్టికెక్కి ప్రవర్తిస్తున్నవని' మండిపడ్డారు. మరో ట్వీట్‌లో 'జగన్ గారు.. ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు. నాకు కుల పిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను. ప్రతి కులాన్ని గౌరవిస్తానని' రాసుకొచ్చారు.
జగన్ గారు ...ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
నాకు కుల పిచ్చి లేదు
నా కులాన్ని నేను ప్రేమిస్తాను
ప్రతి కులాన్ని గౌరవిస్తాను @VSReddy_MP