నందమూరి బాలకృష్ణను చూడడానికి వచ్చి నదిలో దూకేశాడు.. ఆ తర్వాత
Balakrishna fan fall in to river. నందమూరి బాలకృష్ణ.. అటు సినిమాలు, షోలతోనే కాకుండా హిందూపుర్ ఎమ్మెల్యేగా కూడా
By Medi Samrat Published on 19 Oct 2022 3:35 PM ISTనందమూరి బాలకృష్ణ.. అటు సినిమాలు, షోలతోనే కాకుండా హిందూపుర్ ఎమ్మెల్యేగా కూడా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు హిందూపురం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ లేనంతగా వర్షం, ఊహించని రీతిలో నదులు, ఉపనదులు పొంగిపొర్లుతూ ఉండడంతో ప్రజల కోసం బాలయ్య హిందూపురంలోనే ఉన్నారు. ఇక బాలయ్యను కలవడానికి అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఓ అభిమాని మాత్రం బాలయ్యను చూడడానికి పెద్ద సాహసమే చేశాడు.
హిందూపురాన్ని ఆనుకుని ఉన్న చౌడేశ్వరి కాలనీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడ పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ వారందరికీ భరోసా కల్పించారు. తాను అండగా ఉంటానని తేల్చి చెప్పారు. అక్కడి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్న క్రమంలో బాలయ్య ని చూడాలని వంతెన అవతలి గట్టుపై ఉన్న అభిమానులు, ఒక్కసారిగా నది ఇవతలి వైపు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ అభిమాని ఏకంగా నదిలోకి దూకి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
That's it he wants to meet #NANDAMURIBALAKRISHNA #HINDUPURMLA #CRAZYFAN #NBKFANS pic.twitter.com/VSYUgN5vJi
— GOPI NALLAPANENI (@gopi9999) October 18, 2022
వర్షాల కారణంగా వంతెన కొట్టుకుపోవడంతో, అవతలివైపు ఉన్న వారు ఇవతల వైపుకు రావాలనే ప్రయత్నం చేయగా స్థానికులు వారించారు. అయినా పట్టించుకోకుండా బాలకృష్ణ మీద అభిమానంతో ఓ అభిమాని బాలకృష్ణను చూడటం కోసం నీళ్లలోకి దూకి ఇవతలకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ నీటి ప్రవాహం ఉదృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చివరకు సదరు అభిమానిని వేరే చోట ఉన్న కొందరు కాపాడి బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.