కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజుల పాటు షరత్‌లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేయబడింది. అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 25 మధ్యాహ్నం రెండు గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది.
మూడు రోజులు స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రావద్దని.. పోలీసులు అనంతబాబుతోనే ఉండాలని, కేసు విషయంపై ఎక్కడా ప్రస్తావించకూడదని అంత్యక్రియలకు మాత్రమే బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది. మే 19న రాత్రి కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అనంతరం అనంతబాబు మే 23న అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. హత్య కేసుపై తీవ్ర్ చర్చ జరిగింది.