బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముసిగింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్ర ఐదు గంటల వరకు బద్వేల్‌లో 59.58 శాతం పోలింగ్ నమోదయ్యింది. 281 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. బద్వేల్ ఉప ఎన్నికను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు సీఈఓ విజాయనంద్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు.
బద్వేలు నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేస్తున్నారని, ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఏపీ సీఈవో విజయానంద్ స్పష్టం చేశారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా... వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్ జండర్ 22 మంది ఉన్నారు. 2019ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది.