స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనమే.!

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు.

By Medi Samrat  Published on  21 Jun 2024 4:45 PM IST
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనమే.!

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనం కానుంది. శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడిని తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అయ్యన్నపాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు.

నేడు అసెంబ్లీ సమావేశాల్లో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత చంద్రబాబునాయుడు తర్వాత జనసేన చీఫ్, డిప్యూట్ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమం ప్రకారం ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు.

Next Story