సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ మంత్రి
Ayyanna Patrudu Fires On CM Jagan. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విటర్
By Medi Samrat
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సింపతీ వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం జగన్ రెడ్డి.. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయ్ శవాల దగ్గర నుండి కోడికత్తి వరకూ దేనిని వదలని జగన్ రెడ్డి బోసిడికె పదాన్ని వదులుతాడా? తెలంగాణ పదకోశంలో బోసిడికె అంటే 'పాడై పోయిన' అనే అర్థముంది అని ట్వీట్ చేశారు.
సానుభూతి కోసం ఎంతకైనా దిగజారే జగన్ రెడ్డి.. సలహాల సజ్జలని బోసిడికె అంటే.. అది తననే అన్నారని అన్వయించుకుని.. బోసిడికె పదానికి పెడార్ధాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డ్ బయటకి తీసారని ఆరోపించారు. తల్లిపై నిజంగా ప్రేమ ఉంటే.. తల్లిని బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇవ్వడు. తల్లిని, చెల్లిని అలా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడని అయ్యన్నపాత్రుడు వరుస ట్వీట్లు చేశారు.
సింపతీ వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం @ysjagan. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయ్ శవాల దగ్గరనుండి కోడికత్తి వరకూ దేనిని వదలని జగన్ రెడ్డి బోసిడికె పదాన్ని వదులుతాడా? తెలంగాణ పదకోశంలో బోసిడికె అంటే 'పాడై పోయిన' అనే అర్థముంది.(1/3) pic.twitter.com/7glff83A8e
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 24, 2021
తల్లిపై నిజంగా ప్రేమ ఉంటే, తల్లిని బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇవ్వడు. తల్లిని, చెల్లిని అలా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడు.(3/3)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 24, 2021