కొడాలి నాని ఇంటి ముట్టడికి తెలుగు మహిళల యత్నం

Attempt of telugu women to Attack Kodali Nani House. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు మహిళలు యత్నించారు

By Medi Samrat
Published on : 6 Sept 2022 6:18 PM IST

కొడాలి నాని ఇంటి ముట్టడికి తెలుగు మహిళల యత్నం

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు మహిళలు యత్నించారు. కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ గుడివాడలో తెలుగు మహిళల డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలుగు మహిళలు కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, తెలుగు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొడాలి నానికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొడాలి నాని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టి.యల్.పి. అంటే తెలుగు లయన్స్ పార్టీ అంటూ నినాదాలు చేశారు తెలుగు మహిళలు. కొడాలి నాని పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు మహిళలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించారు.


Next Story