సీఎం జగన్‌పై దాడి.. చంద్రబాబు, లోకేష్ రియాక్షన్.. వైసీపీ కీలక ప్రకటన
రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు.
By అంజి Published on 14 April 2024 1:03 AM GMTసీఎం జగన్‌పై దాడి.. చంద్రబాబు, లోకేష్ రియాక్షన్.. వైసీపీ కీలక ప్రకటన
రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు కూడా వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ కీలక ప్రకటక చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా కోరింది. మరోవైపు సీఎం జగన్‌పై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు నిజంగానే ఖండించారనుకుంటే టీడీపీ ఎక్స్ ఖాతా నుండి ఎందుకు నీచంగా పోస్టులు చేయిస్తున్నారంటూ వైసీపీ ఫైర్ అయ్యింది.
సీఎం జగన్‌పై దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా!' అని నారా లోకేస్ ట్వీట్ ఏచశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ 2019లో కోడికత్తి, 2024లో రాయి అని వాటి ఫొటోలు పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 13, శనివారం విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల బస్సు యాత్రలో రాళ్లతో దాడి చేశారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) తెలిపింది. 'ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌పై బస్సులో దాడి జరిగింది. రాయి తగలడంతో ఎడమ కనుబొమ్మపై గాయమైంది. అతడిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమకంటికి గాయమైంది' అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం జగన్ ప్రచారం చేస్తున్నారు.
మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.