అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఎక్కడ కూర్చుంటారంటే.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌ నియామకం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకుంటారు.

By Medi Samrat  Published on  20 Jun 2024 7:40 PM IST
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఎక్కడ కూర్చుంటారంటే.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌ నియామకం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకుంటారు. ఏపీ శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుందని.. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఆయన వెంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారని.. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. అసెంబ్లీలో సీటింగ్ ఆర్డర్‌ను అక్షర క్రమంలో ఏర్పాటు చేస్తామని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులంతా ఒకేచోట కూర్చుంటారన్నారు. ఈ రెండు రోజులు సందర్శకులను అసెంబ్లీలోకి అనుమతించబోమని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరావుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

Next Story