కీలకమైన గవర్నర్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిఎస్ శ్రీధరన్ పిళ్లై స్థానంలో గోవా కొత్త గవర్నర్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు. టీడీపీకి చెందిన ఆయన తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటివరకూ ఆయన ఏడు సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన పలు మార్లు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసారు.[
2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబునాయుడు హయాంలో ఫినాన్స్, లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు.
ఇదిలావుంటే.. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు.