ఏపీలో ఆరోగ్య శ్రీ పేరు మార్పు
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ వస్తోంది
By Medi Samrat Published on 13 July 2024 1:58 PM GMTఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ వస్తోంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు కు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు(NTR) వైద్య సేవ పేరును పునరుద్దరిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తుంది. ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ఫామ్ మెకనైజేషన్ స్కీం, డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లుగా కూటమి ప్రభుత్వం పేర్లు మార్పు చేసింది. వైఎస్సార్ యంత్రసేవ కేంద్రాలను విలేజ్/క్టస్టర్ సీహెచ్‌సీలు, వైఎస్సార్ యాప్‌ను వీఏఏ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్‌గా మార్చారు.