ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఆ బ‌స్సుల్లో ఛార్జీలపై 20% తగ్గింపు

APSRTC offers a 20% discount on fare to Hyderabad. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే గరుడ, నైట్ రైడర్, ఇంద్ర, అమరావతి

By Medi Samrat  Published on  26 Jan 2022 10:26 AM GMT
ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఆ బ‌స్సుల్లో ఛార్జీలపై 20% తగ్గింపు

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే గరుడ, నైట్ రైడర్, ఇంద్ర, అమరావతి, వెన్నెల స్లీపర్ సర్వీసులు వివిధ ఎయిర్ కండిషన్డ్(ఏసీ) బస్సుల టిక్కెట్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ మంగళవారం ప్రకటించింది. విజయవాడ, మచిలీపట్నం, ఆటో నగర్, గుడివాడ బస్ డిపోల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఫిబ్రవరి 28 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎం. యేసు దానం తెలిపారు.

హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు ఆదివారం మినహా అన్ని రోజులలో.. హైదరాబాద్ నుండి వచ్చే అప్పుడు శుక్రవారం మినహా అన్ని రోజులలో తగ్గింపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు. గరుడ సర్వీస్ మచిలీపట్నం-బీహెచ్‌ఈఎల్‌కు సాధారణ రోజుల్లో ఛార్జ్‌ రూ. 785 ఉండ‌గా.. రాయితీ తర్వాత రూ.685 ఉండ‌నుంది. డిస్కౌంట్ తర్వాత మచిలీపట్నం-బీహెచ్‌ఈఎల్ నైట్ రైడర్ సీటు ధర రూ.640 మరియు నైట్ రైడర్ బెర్త్‌కు రూ.800, గుడివాడ-బీహెచ్‌ఈఎల్ (ఇంద్ర) రూ.555, విజయవాడ-హైదరాబాద్ (అమరావతి) రూ.535 ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story