6 న అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. యాజమన్యానికి నోటీసు.!

APSRTC JAC leaders giving strike notice to employers. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఫిబ్రవరి 6వ

By అంజి  Published on  2 Feb 2022 3:55 AM GMT
6 న అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. యాజమన్యానికి నోటీసు.!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఫిబ్రవరి 6వ తేదీ అర్థరాత్రి నుండి సమ్మె చేపట్టనున్నామని తెలిపారు. ఈ మేరకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మిక పరిషత్‌, ఆఫీస్‌ స్టాఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఈయూ, ఎన్‌ఎంయూ సహా 12 సంఘాలతో కూడిన జేఏసీ నాయకులు సమ్మెకు సిద్ధమయ్యారు. మొత్తం 45 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంగళవారం నాడు విజయవాడ నగరంలోని ఆర్టీసీ హౌస్‌లో మేనెజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావుకు అందించారు. తమ సమస్యలను మరో 4 రోజుల్లో పరిష్కరించకుంటే ఫిబ్రవరి 5వ తేదీ అర్థరాత్రి నుండి సమ్మె చేపడతామన్నారు.

కాగా ఈ విషయమై ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. రాష్ట్ర సర్కార్‌ ఎలాంటి పీఆర్సీ ఇస్తుందో ఇంకా తెలియలేదని, ఇలాంటి సందర్భంలో సమ్మెలోకి వెళ్లడం సరికాదన్నారు. ప్రజలకు.. ప్రజా రవాణా ద్వారా ఇబ్బందులు కలిగించొద్దని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ నేతలు చెప్పారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమానికి తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగులు కూడా మద్దతు తెలిపారు. వారు కూడా పీఆర్సీ సాధన సమితిని ఏర్పాటు చేశారు. పలు తీర్మానాలు చేశారు.

Next Story