ఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్.. పాల్గొన్న డీజీపీ

APSDRF Mock Drill. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ లో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌ పాల్గొన్నారు.

By Medi Samrat
Published on : 30 July 2021 3:48 PM IST

ఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్.. పాల్గొన్న డీజీపీ

విజ‌య‌వాడ పున్న‌మి ఘాట్‌లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ లో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభించి ఇది 4వ సంవత్సరమ‌ని.. దేశంలోనే ఉత్తమైన ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ గా సేవలను అందిస్తోంద‌న్నారు. ప్రజల ప్రాణాలను విపత్కర పరిస్థితులలో కాపాడటానికి ఏపీ పోలీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ సిబ్బంది ప్ర‌ద‌ర్శించిన‌ విన్యాసాల‌ను తిల‌కించారు.


ఇదిలావుంటే.. ఏపీ ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ కు చెందిన 540మంది సిబ్బంది జాతీయ స్థాయి శిక్షణ సంస్థ ద్వారా.. అత్యంత ఆధునిక అడ్వాన్స్ టెక్నాలజి వినియోగంలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందారు. ఏపీలో ఆరు కంపెనీలతో కూడిన 600 మంది పోలీస్ సిబ్బందితో అత్యంత బలమైన ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ గా సేవలను అందిస్తుంది. మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా 12 బృందాలతో ఆరు ప్రాంతల కేంద్రంగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు మంగళగిరి, నెల్లూరు కర్నూలు సేవలను అందిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ చాలా బలపడింది. ఏపీ ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయం తో కలిసి పని చేస్తుంది.


Next Story