యువతకు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (SEEDAP) నిర్వహణలో పారిశ్రామిక రంగంలో ఉపాధి.

By Medi Samrat
Published on : 27 Dec 2024 8:02 PM IST

యువతకు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (SEEDAP) నిర్వహణలో పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధికి ఇస్తున్న ఉచిత శిక్షణకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలను అందించడానికి మరియు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా పారిశ్రామికవేత్తలు/స్వయం ఉపాధిని సృష్టించడానికి పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలతో యువతకు సాధికారత కల్పించడానికి ప్రభుత్వo కృషి చేస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా సీడప్ (SEEDAP) నిరుద్యోగ యువత కోసం వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన యువతను అవసరమైన పరిశ్రమల యజమానులతో అనుసంధానించడం జరుగుతుందన్నారు . పరిశ్రమల అవసరాలకు సరిపోలని నైపుణ్యాలు ఉన్నవారికి, నాణ్యమైన రెసిడెన్షియల్ శిక్షణలను ఉచితంగా సీడప్ అందించి స్కిల్ గ్యాప్‌ని భర్తీ చేస్తుందని తెలిపారు. ఉచిత శిక్షణలో రవాణా, కెరీర్ కౌన్సెలింగ్, యూనిఫాం, వసతి, ఆహారం, స్టడీ మెటీరియల్, ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఎన్ ఎస్ డి సి ద్వారా సర్టిఫికేషన్, ఉద్యోగ నియామకాలు, పోస్ట్ జాబ్ ప్లేస్ మెంట్ కు మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న మైనార్టీల సంక్షేమ/మైనారిటీల ఫైనాన్స్ కార్యాలయాలలో మైనార్టీ యువత ఉచిత శిక్షణ పొందుటకు తమ దరఖాస్తు ఫారాలను (biodata) అందించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.

Next Story