ఆ చిన్న పథకం అమలు చేయడానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?
చంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది.. కూటమి ప్రకటించిన సూపర్-6లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానంపై ఇంకా ఉలుకూ పలుకూ లేదని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు
By Medi Samrat Published on 12 July 2024 4:57 PM ISTచంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది.. కూటమి ప్రకటించిన సూపర్-6లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానంపై ఇంకా ఉలుకూ పలుకూ లేదని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. ఇది మంచి పథకం కాబట్టే తెలంగాణ, కర్ణాటకల్లో అమలవుతోందన్నారు. తెలంగాణలో అధికారం లోకి వచ్చిన నెలలోపే.. కర్ణాటకలో మూడో వారంలోపే ఈ పథకాన్ని కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. మహిళలకు రక్షణ ఆర్థిక వెసులుబాటు కలిగించే పథకం ఇదన్నారు. ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు అర్ధం కావడం లేదన్నారు. దీనీలో విధి విధానాలు ఏముంటాయి? చిత్తశుద్ధి ఉంటే చాలు అని అన్నారు.
తల్లికి వందనం వాగ్దానం అందరి పిల్లలకూ అన్నారు.. కానీ జీవోలో మాత్రం ప్రతీ తల్లికీ 15,000 అన్నారు. సాక్షిలో తల్లికి పంగనామం అని రాసింది.. ఇంత అయోమయం ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రతీ తల్లికే 15,000 ఇస్తారా.. ప్రతీ బిడ్డ కూ 15,000 ఇస్తారా.. చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో జగన్ కూడా ఇలానే మోసం చేశారన్నారు. నాతో కూడా అప్పట్లో ఇలానే ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకూ అంటూ జగన్ తప్పుడు ప్రచారం చేయించారన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కేటాయించాలి. టీడీపీ వాళ్లు మోదీనీ ఒప్పిస్తామంటున్నారు. ఒకవేళ ఆయన ఒప్పుకోకుంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా ఏపీని మోసం చేస్తున్న మోదీ మీద నమ్మకం ఉంది అని టీడీపీ వాళ్లు ఎలా అంటారన్నారు.
మోదీ అంటేనే మోసం.. ఏపీకి పదేళ్లుగా వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. వైజాగ్ స్టీల్ కోసం వైఎస్ఆర్ పాటు పడితే.. గత ఐదేళ్లు జగన్ దానికోసం ఎలాంటి చర్యా తీసుకోలేదన్నారు. చంద్రబాబు ఇప్పుడు అయోమయం ప్రకటనలు ఇప్పిస్తున్నారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ నాయకుడిగా రెండు సార్లు ఎన్నుకోబడ్డారు.. అలాంటి వ్యక్తి విగ్రహాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ వైసీపీ నాయకుడు కాదన్నారు. వైసీపీ కక్ష పూరిత చర్యలు చేసి ఉండొచ్చు .. మేము కాదనడం లేదు.. కాని వైఎస్ఆర్ ను దానికి బాద్యుడిని చేస్తే ఎలా..? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ.. వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు.. ఆయనకూ, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.