ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద లెక్కకడుతున్నారు: షర్మిల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు.

By Knakam Karthik
Published on : 8 March 2025 11:11 AM IST

Andrapradesh, Ys Sharmila, International Womens Day, Ap Government, Bjp

ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద లెక్కకడుతున్నారు: షర్మిల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా.. " మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, అసలు సృష్టే లేదు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది" అని షర్మిల రాసుకొచ్చారు.

ఇవాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదు. ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కకడుతుంది. వికసిత భారత్‌లో గంటకు 50 మందిపై భౌతిక దాడులు, రోజుకు 80 మందిపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత శోచనీయం. పేరుకే నారీశక్తి వందన్ అది నియమ్. ఆచరణలో మహిళలను నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీది తన అనుబంధ సంఘాలది. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్ ట్రాక్ చట్టాలు ఉన్నా, పేరుకే తప్ప, ఆచరణలో శూన్యం' అని షర్మిల బీజేపీపై విమర్శలు చేశారు.

ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మహిళలకు గౌరవం లేదు. గడిచిన పది సంవత్సరాలలో 2 లక్షల వేధింపుల కేసులు నమోదు కావడం, గత ఐదేళ్లలో 25 శాతం అఘాయిత్యాలు పెరగడం, 54 వేల మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు కావడం అత్యంత దారుణం. మహిళలపై దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌ వన్‌గా ఉండటం సిగ్గుచేటు. హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. మరో వైపు మహిళా సాధికారత అంటూ చేస్తున్నది కూడా మోసమే. మహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ.1500 ఆర్థిక సాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు లాంటి పథకాలు ఇస్తామని.. మహిళలకు టోకరా పెట్టారు తప్పిస్తే...ఉద్ధరించింది శూన్యం' అని వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Next Story