ట్రిపుల్ ఐటి పరీక్ష ఫలితాలు విడుదల
AP Triple IT Exam Results Released. ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలు విడుదలయ్యాయి.
By Medi Samrat
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించామన్నారు. ఈ పరీక్షకు 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని.. రెండు వారాల అనంతరం క్లాస్ వర్మ్ స్టార్ట్ చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు.
ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో సుమారు 4 వేల పైచిలకు ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతమైన విద్యార్థుల కోసం ఉచితంగా భోజన, వసతి తదితర ఏర్పాట్లను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వీటిని ఇంకా బలోపేతం చేస్తామని, మౌలిక వసతులను ఇంకా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్జీయూకేటీ(RGUKT) వెబ్ సెట్ లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు. కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్‌స టెస్ట్ నవంబర్ 28న నిర్వహించారు.